GST: రూ. 824 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టిన క్రిప్టో కంపెనీలు

by S Gopi |
GST: రూ. 824 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టిన క్రిప్టో కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీలు ఇప్పటివరకు రూ. 824 కోట్ల విలువైన జీఎస్టీ ఎగొట్టాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో బినాన్స్ గ్రూప్ కంపెనీ మాత్రమే రూ. 722.43 కోట్ల జీఎస్టీని చెల్లించలేదని సోమవారం పార్లమెంటులో తెలియజేసింది. ఇప్పటి వరకు 17 క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలపై రూ.824.14 కోట్ల జీఎస్టీ ఎగవేతపై కేసులు నమోదు చేశామని, వడ్డీ, పెనాల్టీ, పన్నుల రూపంలో ఇప్పటివరకు రూ.122.29 కోట్లు రికవరీ చేశామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అందులో జన్‌మై ల్యాబ్స్ ప్రైవేట్ (వాజిర్ఎక్స్) ద్వారా రూ. 40.51 కోట్లు, కాయిన్‌డీసీఎక్స్ రూ. 16.84 కోట్లు, కాయిన్‌స్విచ్ కుబేర్ ద్వారా రూ. 14.13 కోట్ల జీఎస్‌టీ ఎగవేతను గుర్తించినట్టు పేర్కొంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం-2002 (పీఎంఎల్ఏ) కింద ఇప్పటి వరకు 47 వర్చువల్ డిజిటల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా వద్ద నమోదు చేసుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed