Tirupati: తొక్కిసలాటలో భక్తులు మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

by srinivas |   ( Updated:2025-01-08 17:41:59.0  )
Tirupati: తొక్కిసలాటలో భక్తులు మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati) తొక్కిసలాట(Stampede) ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.


తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల(Tirumala Srivari Vaikunta Darshans) నేపథ్యంలో తిరుపతిలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ నెల 10 నుంచి దర్శనాలకు భక్తులను అనుమతించేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ దర్శనాలకు గురువారం తెల్లవారుజాము నుంచి తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 కేంద్రాల్లో టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నారు.


అయితే ఈ సాయంత్రానికే భక్తులు భారీగా చేరుకున్నారు. క్యూలైన్లలో బారులు తీరారు. ఈ నేపథ్యంలో విష్ణు నివాసంతో పాటు పలు చోట్ల ఏర్పాటు చేసిన కేంద్రాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని రుయాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఘటన స్థలాన్ని టీటీడీ ఈవో శ్యామలారావు పరిశీలించారు. అధికారులతో కలిసి పరిస్థితిపై ఆరా తీశారు.

Advertisement

Next Story

Most Viewed