రేపు ఈడి ఏదుట అరవింద్ కుమార్

by M.Rajitha |
రేపు ఈడి ఏదుట అరవింద్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏసీబీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్ ను సుధీర్ఘంగా విచారించారు. ఏసీబి డీజీ విజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం అరవింద్ కుమార్ ను ప్రశ్నించారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ జరిగిందని అరవింద్ కుమార్ తెలిపినట్లు సమాచారం. అగ్రిమెంట్ లో అన్ని తానే వ్యవహించారని అరవింద్ కుమార్ స్టేట్మెంట్ గా చెప్పినట్లు తెలుస్తుంది. ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ పై ఏసీబీ అధికారలు అగిడిన ప్రశ్నలుగా చెప్పుకోస్తన్నవి అగ్రిమెంట్ చేసుకున్న ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూరాలని ప్రజా ధనానికి నష్టం వాటిల్లేలా చర్యలు చెపట్టినట్లు అభియోగాలను సమర్ధిస్తున్నారా. ప్రభుత్వ నిబంధనలు, సెక్రటేయట్ బిజినెస్ రూల్స్ గురించి తెలిసి విదేశి కంపెనీలకు హెచ్ఎండిఏ నిధులు తరలింపు పై సమాధానం ఏంటని ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. మంత్రిగా కేటీఆర్ ప్రభావం ఏ మేరకు పని చేశారని ప్రశ్నించారు. హెచ్ఎండిఏ నిధులను అక్రమంగా వినియోగించారని ప్రిన్సిపల్ సెక్రటరి దాన కిషోర్ పిర్యాదులో పేర్కోన విధంగా హెచ్ఎండిఏ నిధుల చెల్లింపులలో అధికార పరిధి దాటి చేశారా లోబడి చేశారా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా నిధులు చెల్లింపులు ఎలా చేశారని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఎస్ నెక్ట జెన్ కంపెనీ ఏర్పాటు విషయం తెలియకుండా అగ్రిమెంట్ ఎలా చేసుకున్నారని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. వారి స్టే్ట్మెంట్ ను రెండు దర్యాప్తు సంస్థలు రికార్డు చేయనున్నాయి. గురువారం ఈడి విచారణకు అరవింద్ కుమార్ హజరు కావల్సి ఉంది.

9గంటల పాటు బిఎల్ఎన్ రెడ్డి విచారణ

ఫార్ములా ఈ కార్ రేస్ విచారణలు బుధవారం జరిగాయి. ఓ వైపు ఏసీబీ విచారణకు సీనీయర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హజరవగా. మరో వైపు ఈడి విచారణకు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ ఎన్ రెడ్డి హజరయ్యారు. సుమారు తొమ్మిది గంటల పాటు ఈడి అధికారులు బిఎల్ ఎన్ రెడ్డిని విచారించారు. ఫార్ముల ఈ రేస్ అగ్రిమెంట్ జరిగిన విధి విధానాలపై , రేస్ నిర్వహణ కోసం రోడ్లు మరమత్తులకు, ఇతర కార్యక్రమాలు హెచ్ఎండిఏ ఎంత ఖర్చు చేసింది, ఏ ప్రతిపాదికన నిధులు విడుదల జరిగిందనే కోణాలలో ఈడి ప్రశ్నించినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed