- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Delhi: ఢిల్లీలో ఆప్ వర్సెస్ బీజేపీ.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో వేడెక్కిన రాజకీయం
దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో పరస్పరం విమర్శలకు దిగాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం నివాసం ‘శీష్ మహల్’పై వ్యాఖ్యలు చేయడంపై ఆప్ మండిపడింది. దీనిపై ఇరువర్గాలు బుధవారం ఆందోళనకు దిగాయి. సీఎం నివాసంలో స్లీపింగ్ టాయిలెట్, స్విమ్మింగ్ పూల్, మినీబార్ ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్ (Sanjay singh) , సౌరభ్ భరద్వాజ్(Sowrav baradhvaj) లు నిజానిజాలను ప్రజలకు చూపిస్తామని మీడియాతో కలిసి సీఎం నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తమ మద్దతుదారులతో కలిసి ఆందోళన చేపట్టగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అబద్దాలు బయటపడ్డాయి: సంజయ్ సింగ్
పోలీసులు తమను అడ్డుకోవడంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మండిపడ్డారు. ‘బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలు, అవాస్తవాలని స్పష్టంగా వెల్లడైంది. సీఎం నివాసంలో బంగారు మరుగుదొడ్డి, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ అంటూ నెలల తరబడి కాషాయ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దానిని ప్రజలకు చూపించాలని సీఎం నివాసం వద్దకు వచ్చాం. కానీ వారు వాటర్ ఫిరంగులు, పోలీసులను మోహరించారు. మేమేమైనా ఉగ్రవాదులమా? అని ప్రశ్నించారు. నిజాలు భయటపడతాయనే బీజేపీ లోనికి వెళ్లకుండా అడ్డుకుంటుందని ఫైర్ అయ్యారు.
పీఎం నివాసం ఎదుట ధర్నా
ప్రధాన మంత్రి నివాసాన్ని ‘రాజ్ మహల్’గా సంజయ్ సింగ్ అభివర్ణించారు. దీని నిర్మాణానికి 2,700 కోట్లు ఖర్చయిందని తెలిపారు. ప్రధాని ఇంట్లో మీడియా పర్యటనకు అనుమతించాలని బీజేపీకి సవాల్ విసిరారు. ఢిల్లీ సీఎం నివాసం ఎన్ని కోట్లతో నిర్మించారో చూసి, ఆ తర్వాత పీఎం రాజ్‌మహల్‌కు వెళ్దామని సూచించారు. అనంతరం ఆప్ నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ పీఎం నివాసం వైపుగా దూసుకెళ్లారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా పోలీసులకు, ఆప్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనూ ఆప్ నేతలు ప్రధాని నివాసం దగ్గర ధర్నాకు దిగారు. పీఎం నివాసాన్ని ప్రజలకు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు.
అతిశీ బంగ్లా వద్ద బీజేపీ నిరసన
ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా (Sach deva) తన మద్దతు దారులతో కలిసి సీఎం అతిశీ బంగ్లాకు చేరుకున్నారు. తనకు నివాసం కేటాయించడం లేదని అతిశీ చేసిన ఆరోపణలను ఖండించారు. మధుర రోడ్డులో బంగ్లా కేటాయించగా.. ఆమె కల్కాజీలో నివసిస్తు్న్నారని ఆరోపించారు. ఇంకా ఎన్ని భవనాలు కావాలని ప్రశ్నించారు. అతిశీకి కేటాయించిన నివాసంలో మాజీ సీఎం షీలా దీక్షిత్ 15 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపారని నొక్కి చెప్పారు. శీశ్ మహలే ఎందుకు కావాలని ప్రశ్నించారు. దీంతో ఆప్, బీజేపీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది.