చిన్ననాటి స్నేహితులతో ఎమ్మెల్యే బర్త్ డే సెలబ్రేషన్స్

by Naveena |
చిన్ననాటి స్నేహితులతో ఎమ్మెల్యే బర్త్ డే సెలబ్రేషన్స్
X

దిశ, వనపర్తి : చిన్ననాడు..తనతో కలిసి చదువుకున్న మిత్రులతో కలిసి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి బుధవారం తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఖిల్లా గణపురం మండల కేంద్రంలో 1987- 88 లో కలిసి విద్యాభ్యాసం చేసి వివిధ రంగాలలో స్థిరపడ్డ మెగా రెడ్డి మిత్రులు వనపర్తికి తరలివచ్చి ఎమ్మెల్యే మెగా రెడ్డితో కేకు కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొంతసేపు ఎమ్మెల్యే మెగారెడ్డి తన మిత్రులతో ఉత్సాహంగా గడిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మెగారెడ్డి మిత్రబృందం రామ్మోహన్, చిరాయువు, రాజ వర్ధన్, శ్రీరాములు, సయ్యద్ రియాజుద్దీన్, ఖాజా మైనుద్దీన్, బోడ శ్రీనివాసులు, సతీష్, ఎం వెంకటయ్య, తాజుద్దీన్, బాల్ లింగం, సామల ఆంజనేయులు, ఉప్పరపల్లి శ్రీను, చంద్రశేఖర్, బెక్కరపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed