Brain rot : ఆక్స్‌ఫర్డ్‌ ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ‘బ్రెయిన్‌ రాట్‌’

by Hajipasha |
Brain rot : ఆక్స్‌ఫర్డ్‌ ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ‘బ్రెయిన్‌ రాట్‌’
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘బ్రెయిన్ రాట్’(Brain rot) .. ఇదే ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2024’. ఈవిషయాన్ని ఆక్స్‌ఫర్డ్‌(Oxford) యూనివర్సిటీ ప్రెస్‌ ప్రకటించింది. బ్రెయిన్‌ రాట్‌ అంటే మానసిక లేదా మేధో స్థితి క్షీణించడం. అవసరం లేని సోషల్ మీడియా కంటెంట్‌ను అతిగా చూస్తే బ్రెయిన్‌ రాట్‌ సమస్య వస్తుంది. సోషల్‌మీడియాను అతిగా వినియోగించే వారిలో ఈ సమస్య తలెత్తుతోంది. గత ఏడాది కాలంగా ఈ పదం విస్తృతంగా వినియోగంలో ఉంది.

ఈసారి ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2024’ టైటిల్ కోసం.. ‘డెమ్యూర్‌’ (రిజర్వ్‌గా ఉండడం), డైనమిక్‌ ప్రైసింగ్‌ (ధరల్లో మార్పు), లోర్‌ (నేపథ్య సమాచారం), రొమాంటసీ (రొమాన్స్‌+ ఫాంటసీ), స్లోప్‌ (లో క్వాలిటీ ఏఐ కంటెంట్‌) అనే పదాలతో ‘బ్రెయిన్ రాట్’ పోటీపడింది. దాదాపు 37 వేల మంది పోల్‌లో పాల్గొన్నారు. అత్యధిక సంఖ్యలో ప్రజల ఓట్లు పొందిన ‘బ్రెయిన్‌ రాట్‌’ పదానికే ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2024’ టైటిల్‌ను ప్రకటించారు. ప్రముఖ ఇంగ్లిష్ రచయిత హెన్రీ డేవిడ్‌ 1854లో తాను రాసిన ‘వాల్డెన్‌’ అనే పుస్తకంలో తొలిసారి ఈ పదాన్ని వినియోగించారు.

Advertisement

Next Story

Most Viewed