Train Accidents : పదేళ్లలో రైలు ప్రమాదాలు 70 శాతం తగ్గాయి : రైల్వే మంత్రి

by Hajipasha |
Train Accidents : పదేళ్లలో రైలు ప్రమాదాలు 70 శాతం తగ్గాయి : రైల్వే మంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో : గత పదేళ్లలో దేశంలో రైలు ప్రమాదాలు(Train accidents) 70 శాతం మేర తగ్గిపోయాయని రైల్వేశాఖ(Railway Ministry) మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. పకడ్బందీ భద్రతా చర్యలు, నిర్వహణపరమైన మెరుగుదల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈమేరకు ఆయన పార్లమెంటుకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

‘‘2004 నుంచి 2014 మధ్యకాలంలో 1,711 రైలు ప్రమాదాలు జరిగాయి. ప్రతి సంవత్సరం సగటున 171 ట్రైన్ యాక్సిడెంట్లు సంభవించాయి. ఇక 2014 నుంచి 2024 మధ్యకాలంలో 678 రైలు ప్రమాదాలే జరిగాయి. ఏటా సగటున 68 ట్రైన్ యాక్సిడెంట్లే జరిగాయి’’ అని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. 2014 - 2015 సంవత్సరంలో దేశంలో 135 రైలు ప్రమాదాలు జరగగా, 2023 - 2024 సంవత్సరంలో 40 రైలు ప్రమాదాలే జరిగాయని ఆయన తెలిపారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed