పవన్ కల్యాణ్‌కు తెలిసే జరిగింది: కాశినాయన ఘటనపై మల్లాది విష్ణు ఫైర్

by srinivas |
పవన్ కల్యాణ్‌కు తెలిసే జరిగింది: కాశినాయన ఘటనపై మల్లాది విష్ణు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: కాశినాయన క్షేత్రం(Kasi Nayana Kshetram)లో కట్టడాలకు అనుమతులు లేవంటూ అటవీశాఖ(Forest Department) అధికారులు కూల్చి వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కూల్చివేతలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే మాల్లాది విష్ణు(Former MLA Malladi Vishnu) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశినాయన క్షేత్రంలో కట్టడాలు కూల్చడం దురదృష్ణకరమన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ కూటమి నాయకులపై మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని(Sanatana Dharma) కాపాడమంటే ఇదేనా అని మల్లాది విష్ణు ప్రశ్నించారు.


జనసేన అధినేత , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy Cm Pawan Kalyan)కు తెలియకుండానే కాశినాయన ఆశ్రమం కూల్చివేశారా అంటూ నిలదీశారు. రాష్ట్రంలో హిందూ ధర్మం(Hindu Dharmam)పై దాడి జరుగుతోందని ఆరోపించారు. పవన్‌కు తెలిసే కాశినాయనలో కూల్చివేతలు జరిగాయన్నారు. హిందూ ధర్మంపై దాడి జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ(Tirumala Laddu) విషయంలోనూ భక్తులను తప్పు దారి పట్టించారని మండిపడ్డారు. ప్రజలు కూటమి నాయకులను ఎందుకు క్షమించాలని మల్లాది విష్ణు నిలదీశారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed