- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. CM రేవంత్ రెడ్డితో హరీష్ రావు భేటీ

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు హరీష్ రావు(Harish Rao), పద్మారావు గౌడ్(Padma Rao Goud)లు భేటీ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీ(Telangana Assembly)లోని సీఎం ఛాంబర్‌లో దాదాపు 15 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించట్లేదని ఈ సందర్భంగా వారు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు.. గంట క్రితమే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది.
ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తే.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. ఇది జరిగిన కాసేపటికే ఇరువురు కలిసి ప్రొటోకాల్ అంశంపై చర్చించుకోవడం ఆసక్తిగా మారింది. రాజకీయాలు ఇలాగే ఉండాలని.. పార్టీల మధ్య వైరం ఉన్నా.. నియోజకవర్గ సమస్యల విషయంలో అవేమీ పట్టించుకోవవద్దని.. ఇది మంచి పరిణామం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.