Tamilnadu: తమిళనాడులో విషాదం.. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి

by vinod kumar |
Tamilnadu: తమిళనాడులో విషాదం.. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు(Tamilnadu)లో విషాదం చోటు చేసుకుంది. ఫెయింజల్(Cyclone Fenga) తుపాను కారణంగా తిరువణ్ణామలై (Tiruvannamalai) పట్టణంలో రెండు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించినట్టు అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రసిద్ధ అన్నామలైయార్ (Annamalayar) కొండకు సమీపంలో ఉన్న ఇళ్లపై పెద్ద రాయి పడింది. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగగా దాదాపు ఏడుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నలుగురి మృత దేహాలను బయటకు తీశారు. స్థానిక ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నయ్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన నిపుణుల బృందం సహాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ సభ్యులు సహా 170 మంది సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఫెయింజల్ తుపాన్ కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed