Kodad: భారీగా గంజాయి పట్టివేత

by Gantepaka Srikanth |
Kodad: భారీగా గంజాయి పట్టివేత
X

దిశ, కోదాడ: గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తుల నుంచి 400 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆబ్కారీ సీఐ శంకర్ వివరాల ప్రకారం.. పోలీసుల బృందం మండల పరిధిలోని చిమిర్యాల వంతెన వద్ద రూట్ వాచ్, వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు వద్ద నుంచి 150 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే మరో ఇద్దరి దగ్గర ఒక పల్సర్ బైక్, 250 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నలుగురి నిందితులపై కేసు నమోదు చేసి.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed