MLC Jeevan Reddy: అవేమీ తెలియకుండా విమర్శలు చేస్తారా?

by Gantepaka Srikanth |
MLC Jeevan Reddy: అవేమీ తెలియకుండా విమర్శలు చేస్తారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ తన ఉనికి కాపాడుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జ్ షీట్ రిలీజ్ చేసిందన్నారు. బీజేపీ సెంట్రల్, స్టేట్ నాయకులకు సరైన అవగాహన లేదన్నారు. సమన్వయ లోపంతో తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుందని, ఇక్కడ అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. కనీస మద్దతు ధర కల్పించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని వివరించారు.

దీనిపై ఇప్పటి వరకు కేంద్రం స్పందించలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న వడ్లకి రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉచిత కరెంట్ రాయితీ పొందుతున్నాయన్నారు. 110 కోట్ల ఉచిత బస్ టిక్కెట్లు అందజేస్తున్నామని వివరించారు. ఇవేమీ తెలియకుండా విమర్శలు తగదు అంటూ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed