పెళ్లింట్లో తీవ్ర విషాదం.. నవ వరుడు దుర్మరణం

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-02 17:06:38.0  )
పెళ్లింట్లో తీవ్ర విషాదం.. నవ వరుడు దుర్మరణం
X

దిశ, మేళ్లచెరువు: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని నవ వరుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల శివార్లలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన గుండవరపు రత్నకుమారికి.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ళకు చెందిన ఉపేంద్రతో గత శుక్రవారం వివాహం జరిగింది. సోమవారం ఆమె తల్లిగారింటికి భర్త ఉపేందర్‌తో కలిసి మోటర్ సైకిల్‌పై వస్తున్నారు. మేళ్లచెరువు శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న గడ్డి ట్రాక్టర్‌ను ఢీ కొట్టారు. దీంతో వరుడు అక్కడికక్కడే మృతిచెందగా.. వధువు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed