డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌కు హృదయపూర్వక ధన్యవాదాలు: హీరో అల్లు అర్జున్

by Mahesh |   ( Updated:2024-12-02 16:41:36.0  )
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌కు హృదయపూర్వక ధన్యవాదాలు: హీరో అల్లు అర్జున్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పుష్ప-1 తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. పుష్ప-2(Puspa-2) సినిమాతో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా టికెట్ల ధరల(Ticket prices)ను ఏపీలో పెంచుకునేందుకు గాను.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో హీరో అల్లు అర్జున్(Allu Arjun) ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. బన్నీ తన ట్వీట్‌లో "టిక్కెట్ పెంపును ఆమోదించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రగతిశీల నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల శ్రేయస్సు పట్ల మీకున్న దృఢ నిబద్ధతను తెలియజేస్తుంది. సినిమా ఇండస్ట్రీ మేలుకోసం ఈ నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(CM Chandrababu) గారికి, అలాగే చిత్ర పరిశ్రమను బలోపేతం చేయడంలో ఆయన అమూల్యమైన మద్దతు ఇచ్చిన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చారు.

Read More...

Pushpa-2: సుకుమార్‌కు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్


Advertisement

Next Story

Most Viewed