- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cm Chandrababu: వర్షాలపై సమీక్ష.. అధికారులకు ఆదేశాలు
దిశ, వెబ్ డెస్క్: ఫెంగల్ తుఫాను ప్రభావంలో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. దీంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. కొన్ని చోట్ల వాగులు, వంకలకు భారీగా వరద నీరు చేరుతోంది. వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అలర్టయింది. సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఉండవల్లి నివాసంలోనిర్వహించిన సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. మొత్తం 53 మండలాల్లో తుఫాను ప్రభావం ఉందని....భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంప్లు ఏర్పాటు చేసి ప్రజలను తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 6,824 హెక్టార్ల మేర వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని....దీనికి అవసరమైన ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. వర్షం కారణంగా తడిచిన ధాన్యం ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాల ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.