బియ్యం అక్రమ రవాణాపై సీరియస్.. కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం

by srinivas |
బియ్యం అక్రమ రవాణాపై సీరియస్.. కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: రేషన్ బియ్యం(Ration rice) అక్రమ తరలింపు వ్యవహారంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాకినాడ పోర్టు(Kakinada Port)లో సముద్రమార్గం ద్వారా వేల టన్నుల రేషన్ బియ్యం విదేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో కలెక్టర్ తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడంతో ఈ బియ్యం అక్రమ దందా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కేబినెట్ సబ్ సమిటీ కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజాగా భేటీ అయి కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిణగణనలోకి తీసుకోవాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. కాకినాడ పోర్టులో 5 వేర్ హౌస్‌లలో సార్టెక్స్ మిషన్లు ఏర్పాటుపై విచారణకు ఆదేశించారు. కాకినాడ పోర్టు భద్రతను పర్యవేక్షించేందుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను నియమించాలని కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు నిర్ణయించారు.

Advertisement

Next Story

Most Viewed