- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RBI: సచిన్ బన్సాల్‌కి చెందిన నవీ ఫిన్‌సర్వ్‌పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్‌బీఐ
దిశ, బిజినెస్ బ్యూరో: ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ నేతృత్వంలోని ఫిన్‌టెక్ కంపెనీ నవీ ఫిన్‌సర్వ్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. నవీ ఫిన్‌సర్వ్ రుణాలకు సంబంధించి కార్యకలాపాలు కొనసాగించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ మూడోవారంలో కంపెనీ రుణాల మంజూరు, పంపీణీ నిలిపేయాలని ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్(డబ్ల్యూఏఎల్ఆర్) ఆధారంగా ధరల అమలు పొరపాట్లను గమనించిన ఆర్‌బీఐ సమీక్ష నిర్వహించింది. కంపెనీ అందించే రుణాలపై ఎక్కువ వడ్డీ విధిస్తున్నట్టు ఆర్‌బీఐ గుర్తించింది. దాంతో రుణాల పంపిణీపై నిషేధం విధించింది. లోపాలను సరిదిద్దేందుకు నవీ ఫిన్‌సర్వ్‌తో ఆర్‌బీఐ చర్యలను సూచించింది. ఈ క్రమంలో కంపెనీ చేసిన మార్పులకు సంతృప్తి చేసిన ఆర్‌బీఐ ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణం అవలవుతుందని ఆర్‌బీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.