MP Renuka Chowdary : మోహన్ భగవత్ పై ఎంపీ రేణుకా చౌదరీ మండిపాటు

by M.Rajitha |
MP Renuka Chowdary : మోహన్ భగవత్ పై ఎంపీ రేణుకా చౌదరీ మండిపాటు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి జంట కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని ఆర్ఎస్ఎస్(RSS) అధినేత మోహన్ భగవత్(Mohan Bhagawath) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. మహిళా సంఘాలు, పలువురు రాజకీయ నాయకులు మోహన్ భగవత్ పై మండిపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరీ(MP Renuka Chowdary) ఆర్ఎస్ఎస్ అధినేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా పిల్లలని కనడానికి ఆడవాళ్ళు ఏమైనా కుందేళ్లు అనుకుంటున్నారా అని ఫైర్ అయ్యారు. అలా చెప్పేవాళ్ళు ఎంతమంది పిల్లల్ని పెంచగలరు? అని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోతుందని, ఉద్యోగం లేనివారికి తమ బిడ్డలను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, భార్యనే సరిగ్గా చూడలేని వాళ్ళు ఇక పిల్లల్ని ఎలా పెంచగలరు అని ఆలోచించలేరా అని రేణుకా చౌదరీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story