కర్నూల్‌లో రోడ్డు ప్రమాదం... మానోపాడు వాసి మృతి..

by Aamani |
కర్నూల్‌లో రోడ్డు ప్రమాదం... మానోపాడు వాసి మృతి..
X

దిశ, అలంపూర్: కార్పెంటర్ సామాగ్రి కొనుగోలు నిమిత్తం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మానవపాడు మండల కేంద్రానికి చెందిన నారాయణ చారి (53) వృత్తిరీత్యా కార్పెంటర్. సోమవారం గ్రామం నుండి కర్నూలు పట్టణంలోని బళ్లారి చౌరస్తాకు కార్పెంటర్ సామాగ్రిని కొనుగోలు చేయడానికి వెళ్లాడు. సామాగ్రి కొనుగోలు చేసుకుని బళ్లారి చౌరస్తా రోడ్డుపై నడిచి వెళ్తుండగా..లారీ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం తో రోడ్డుపై వెళ్తున్న నారాయణచారిపై దూసుకెళ్లింది. దీంతో నారాయణ చారి అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed