- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెడికల్, నర్సింగ్ కాలేజీలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రజా పాలనలో భాగంగా మేడ్చల్ జిల్లాలో పలు కార్యక్రమాలను ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వైద్యారోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ పద్దతిలో ప్రారంభించారు. జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను సీఎం ఆన్ లైన్ లో ప్రారంభించారు. కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ రాధిక గుప్తాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే సంవత్సరం నుంచి కొత్త పారామెడికల్ కోర్సులు—డిప్లొమా ఇ ఇసిజి టెక్నాలజీ (డిఇసిజి), డిప్లొమా ఇ మెడికల్ స్టెరిలైజేషన్ తోపాటు ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ (డిఎంఎస్టి) ప్రారంభం కానున్నాయి.
మల్కాజ్గిరిలో ప్రభుత్వ వైద్య కళాశాల/ఆసుపత్రి ప్రాంగణంలో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైత్రి క్లినిక్ ప్రారంభించారు. ఈ క్లినిక్ వారంలో రెండు రోజులు సేవలు అందించి, ట్రాన్స్‌జెండర్ సమాజానికి సమగ్ర ఆరోగ్య సేవలను అందించడంలో కీలక పాత్ర పోషించనుంది.ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ,.. మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ వైద్య కళాశాల, పారామెడికల్ , నర్సింగ్ కాలేజ్ లను సీఎం ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రఘునాథ స్వామి, ఉప వైద్యాధికారి డాక్టర్ శోభారాణి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వంశీ క్రిష్ణ,నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సంపూర్ణ, వైస్ ప్రిన్సిపాల్ డి.జయంతి లు పాల్గొన్నారు.