Fengal Cyclone : ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. వరదల్లో కొట్టుకుపోయిన బస్సులు, కార్లు

by M.Rajitha |
Fengal Cyclone : ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. వరదల్లో కొట్టుకుపోయిన బస్సులు, కార్లు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆదివారం పుదుచ్చేరి(Puducheri) సమీపంలో తీరాన్ని తాకిన ఫెంగల్ తుఫాన్(Fengal Cyclone) ప్రభావానికి తమిళనాడు(Tamilanadu)ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. తమిళనాడులోణి పుదుచ్చేరి, కృష్ణగిరి జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఉత్తంగిరిలో 14 గంటలకు పైగా భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల దెబ్బకు ఉత్తంగిరి బస్‌స్టాండులో బస్సులు, కార్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. తమిళనాడు వ్యాప్తంగా ఏడు వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. 147 శిబిరాల్లో వారికి ఆశ్రయం కల్పించామన్నారు. పుదుచ్చేరి కృష్ణానగర్ లోని కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టం దాదాపు ఐదు అడుగులకు పెరిగింది. దాదాపు 500 ఇళ్ల లోని నివాసితులు వరదల్లో చిక్కుకున్నారు వీరిలో 100 మందికి పైగా ప్రజలను ఆర్మీ రక్షించిందని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed