ఏపీలో 400 గంజాయి చాక్లెట్ల కలకలం... ఒడిషా వ్యక్తి అరెస్ట్

by srinivas |
ఏపీలో 400 గంజాయి చాక్లెట్ల కలకలం... ఒడిషా వ్యక్తి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల(Telugu states)లో గంజాయి ముఠా(Ganja Gangh) రెచ్చిపోతోంది. ఇప్పటివరకూ డైరెక్ట్‌గా గంజాయినే తరలించారు. ఇప్పుడు ఏకంగా ద్రవం, చాక్లెట్ల రూపంలోనూ సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా కాలేజీ, స్కూలు విద్యార్థులనే టార్గెట్ చేసి గంజాయి చాకెట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ చాకెట్లకు విద్యార్థులు బానిసలు అవుతున్నాయి. చాక్లెట్లు తిని కొందరు అనారోగ్య పాలవుతున్నారు. మరికొందరు గంజాయి మత్తులో అసాంఘిక కార్యకలాపాలతో పాటు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీంతో గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

అయితే పోలీసులు ఎంత నిఘా పెట్టినా సరే ఏదో చోట గంజాయి తరలింపు, విక్రయాలు కలకలం రేపుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేట(Narasa Raopet)లో కలకలం రేపింది. గంజాయి చాక్లెట్లు(Ganja Chocolates)విక్రయిస్తు్న్నారన్న సమాచారంతో ఓ షాపుపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 175 గ్రాముల గంజాయితో పాటు 400 చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన ఉదయానంద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తు్న్నారు. ‘‘గంజాయి ఎక్కడి నుంచి తెచ్చారు. చాకెట్ల రూపంలో ఎవరు తయారు చేశారు. ఎక్కడెక్కడికి సరఫరా చేశారు. ఇప్పటి వరకూ ఎంత సరుకు అమ్మారు. ఏ నగరాలను సరఫరా చేశారు. అసలు దీని వెనుక ఎవరున్నారు..?’’ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story