- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల(Chevella) మండలం ఆలూరు స్టేజ్ వద్ద లారీ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న వారిపై నుంచి లారీ దూసుకెళ్లి చెట్టును ఢీ కొట్టి ఆగిపోయింది. ఇందులో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ఘోరమైన ఘటనపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా తన ట్వీట్‌లో "నేను ఈ సాయంత్రం పార్లమెంట్‌లో ఉన్నాను. చేవెళ్ల దగ్గర జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్ బీజాపూర్ హైవే వెంబడి కూరగాయల వ్యాపారుల వరుసను ట్రక్కు కొట్టివేసింది. ఈ ప్రమాదంలో 4 మంది మరణించారు, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ప్రేమ్, రాములు, సుజాత కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. తీవ్రంగా గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని రాసుకొచ్చారు.