Ponguleti: సంక్రాంతి తర్వాత.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి

by Gantepaka Srikanth |
Ponguleti: సంక్రాంతి తర్వాత.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి(Sankranti) పండుగ తర్వాత రాష్ట్ర రైతులకు రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. డిసెంబర్ 5వ తేదీన యాప్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు(indiramma illu) ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రజా ప్రభుత్వమని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో చేపడతామని అన్నారు.

ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని వెల్లడించారు. పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతూ నిరుద్యోగుల కళ్లలో ఆనందం చూస్తున్నామని అన్నారు. ఇప్పటికే 50 వేల మందికి నియామక పత్రాలు అందించామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆరోగ్యశాఖ(Department of Health)పై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నామని తెలిపారు. కావాలనే గురుకులాలపై కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు పదేళ్లు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు.

Advertisement

Next Story