మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట : సత్తుపల్లి ఎమ్మెల్యే

by Aamani |
మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట : సత్తుపల్లి ఎమ్మెల్యే
X

దిశ,సత్తుపల్లి: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. ప్రజా పాలన విజయోత్సవం సందర్భంగా సత్తుపల్లి మండలంలో పలు గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సభలో ఆమె మాట్లాడుతూ, మహిళలందరికీ ఇందిరమ్మ ఇల్లు, వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు, మహాలక్ష్మి పథకం, అమ్మ ఆదర్శ కమిటీ, మహిళలు ఆర్థిక రంగాల్లో డ్వాక్రా సంఘాల రుణాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లు, పచ్చళ్ళు తయారీ కేంద్రాలు వంటి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

అనంతరం సత్యంపేట, కిష్టాపురం గంగారం, గౌరి గూడెం, పలు గ్రామ పంచాయతీ పరిధిలోని సిసి రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్ సి హెచ్ చిన్న నాగేశ్వరరావు, ఐసిడిఎస్ సిడిపిఓ,ఎస్సే రఘు, ఏఈఓ లు, మండల అధ్యక్షుడు శివ వేణు, పట్టణ అధ్యక్షులు గాదె చెన్నారావు, దాసరి చిట్టి నాయన, చల్లగుళ్ళ నరసింహారావు, ఏం సి చైర్మన్ దోమ ఆనంద్ బాబు, దొడ్డ శ్రీను, గాదెరెడ్డి సుబ్బారెడ్డి, పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story