- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజల ఆకాంక్షల అనుగుణంగా పాలన : వైరా ఎమ్మెల్యే
దిశ,కారేపల్లి : రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల అనుగుణంగా పాలన సాగుతుందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ అన్నారు. సోమవారం కారేపల్లి మండలంలోని 15 గ్రామాలలో అభివృద్ధి పనులకు డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌తో కలిసి ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ శంకుస్ధాపన చేశారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుకు రుణమాఫీ, ధాన్యంకు మద్దతు ధర కల్పనతోపాటు బోనస్ చెల్లింపులతో సీఎం రేవంత్ రెడ్డి పండుగ వాతావరణ కల్పించారన్నారు. పోడుకు హక్కుల కల్పించి ఏజన్సీలో గొడవ లేకుండా చేశామన్నారు. పోడు భూములలో బోర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. కారేపల్లి కళ తెస్తామన్నారు. నాన్ ఎజన్సీ గ్రామం కావటంతో అన్ని శాఖల సహకారంతో కారేపల్లిని తీర్చిదిద్దుదామన్నారు. కారేపల్లి నుండి పేరుపల్లి వరకు డబల్ రోడ్‌కు రూ.6కోట్లు కేటాయించామని ఇది పేరుపల్లికి వస్తుందన్నారు.
రెండో విడత పేరు పల్లి నుండి మాధారం వరకు రోడ్డు పనులు జరుపుతామన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో సురేందర్, ఎంపీవో మల్లెల రవీంధ్రప్రసాద్, సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, పీసీసీ మహిళా ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, దొబ్బఅ సౌజన్య, మండల అధ్యక్షులు తలారి చంద్రప్రకాశ్, నాయకులు బానోత్ రాంమ్మూర్తి, ఇమ్మడి తిరుపతిరావు, మేదరి వీరప్రతాఫ్, మల్లెల నాగేశ్వరరావు, బానోత్ దేవ్లానాయక్, నర్సింగ్ శ్రీనివాసరావు, అడ్డగోడ ఐలయ్య, బానోత్ హిరాలాల్, సురేందర్‌మనియార్, కడియాల సుధాకర్, పొలగాని శ్రీనివాస్, యాకూబ్ అలీ, బోళ్ల రమేష్, అజ్మీర ఈరు, బోడ సెట్రాం, నాగండ్ల జగన్, కుర్సం సత్యనారాయణ, షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.