Windfall Tax: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ రద్దు..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-02 15:14:35.0  )
Windfall Tax: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ రద్దు..!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం(Central Govt) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురు(Crude oil) ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌(Windfall Tax)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గత కొంతకాలంగా పన్ను రద్దు చేసేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం, గ్లోబల్ మార్కెట్(Global Market)లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా 2022 జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్(Petrol), డీజిల్(Diesel), ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF), క్రూడ్ ఆయిల్(Crude oil) ఉత్పత్తుల ఎగుమతులపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను విధిస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగి కంపెనీలకు అధిక లాభాలు వస్తుండంతో ఈ పన్నును అమలు చేయడం ప్రారంభించారు.

అయితే ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 72-75 డాలర్ల మధ్య ట్రేడవుతుండంతో ట్యాక్స్‌ రద్దు చేసింది. దీంతో పాటు పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ప్రభుత్వం విధిస్తున్న రోడ్డు(Road), ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్(Infrastructure Cess)ను కూడా క్యాన్సల్ చేసింది. కాగా కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల రిలయన్స్(Reliance), ఓఎన్జీసీ(ONGC) వంటి కంపెనీలకు లాభం చేకురానుంది. దీంతో ఆయా సంస్థల రిఫైనింగ్‌ మార్జిన్లు పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే విండ్‌ఫాల్‌ ట్యాక్స్ రద్దు ప్రకటనతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు రాణించాయి. ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి ఆ సంస్థ షేర్ వాల్యూ(Share value) 1.42 శాతం లాభపడి రూ.1310.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed