Breaking: భారీ వర్షం.. మూడు రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు

by srinivas |
Breaking: భారీ వర్షం.. మూడు రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు
X

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కూనవరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శబరి వద్ద గోదావరి నీటి మట్టం 40 అడుగులకు చేరడంతో నేషనల్ హైవేపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్ గఢ్-ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు చింతూరు ఏజెన్సీలో కుండపోత వర్షం పడుతోంది. దీంతో 120 గ్రామాలకు పైగా రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు భద్రాచలం- కూనవరం మధ్య రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. వద్దిగూడెం, శ్రీరామగిరి గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది.

Advertisement

Next Story

Most Viewed