అభిషేక్ ‘ఎల్’ సెలబ్రేషన్స్.. అందులో అంత అర్థం ఉందా?

by Harish |
అభిషేక్ ‘ఎల్’ సెలబ్రేషన్స్.. అందులో అంత అర్థం ఉందా?
X

దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ ఈ సీజన్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు. ఆదివారం పంజాబ్‌తో ఆడిన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ మెరుపు హాఫ్ సెంచరీతో సత్తాచాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, హాఫ్ సెంచరీ చేసినప్పుడుగానీ, జట్టు గెలిచినప్పుడుగానీ అతను బొటన వేలు, చూపుడు వేలుతో ‘ఎల్’ సింబల్ చూపిస్తూ సెలబ్రేషన్స్ చేసుకోవడాన్ని గమనించొచ్చు.

ప్రత్యేకంగా ‘ఎల్’ సింబల్ చూపించడానికి కారణం ఉందట. ఈ విషయాన్ని తాజాగా అభిషేక్ శర్మనే రివీల్ చేశాడు. ట్రావిడ్ హెడ్‌తో కలిసి ఆ రకమైన సెలబ్రేషన్స్ మొదలుపెట్టినట్టు చెప్పాడు. ‘అది మా వ్యక్తిగతానికి సంబంధించినది. ఆ సింబల్ ప్రేమను సూచిస్తుంది. మేము ప్రేమను వ్యాప్తి చేయాలనుకుంటున్నాం.’ అని వివరించాడు. అభిషేక్ మాట్లాడిన వీడియోను ఐపీఎల్ రిలీజ్ చేయగా.. ‘ఆ సింబల్‌లో అంత అర్థం ఉందా?’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ సీజన్‌లో అభిషేక్ 13 మ్యాచ్‌ల్లో 467 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ 209.41 ఉండటం గమనార్హం. హైదరాబాద్ తరపున హెడ్(533) తర్వాత అతను రెండో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed