ఓనర్‌ ఇంటికే కన్నం..గుట్టురట్టు చేసిన పోలీసులు

by Aamani |
ఓనర్‌ ఇంటికే కన్నం..గుట్టురట్టు చేసిన పోలీసులు
X

దిశ,ముధోల్: నియోజకవర్గం కేంద్ర మైన ముధోల్ గల సాయి మాధవ్ నగర్ లో గత మూడు రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసును ముధోల్ ఎస్ ఐ సాయి కిరణ్ చాకచక్యంతో ఛేదించారు. పూర్తి వివరాల్లోకెళ్తే ... ముధోల్ లోని సాయి మాధవ్ నగర్ లో నివసిస్తున్న వెంకటేష్ ఇంటికి తాళం వేసి ఈనెల 23వ తేదీన పెళ్లి కి కుటుంబ సమేతంగా హైదరాబాద్ వెళ్లారు.మరుసటి రోజు ఇంటికి వచ్చి చూడగా ఇంటికి వేరే తాళం వేసి ఉంది . దీంతో అనుమానం రావడంతో ఇంట్లో కి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న 7.5 బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లిన విషయం బయట పడింది.దీంతో బాధితులు ముధోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.అయితే సంఘటన స్థలాన్ని బైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ పరిశీలించి కేసు ను వెంటనే చేదించాలని ఎస్ఐ ను ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ ఆదేశాల తో ఎస్సై సాయి కిరణ్ కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపారు.

ఈ కేసు ను 48 గంటల్లో ఛేదించారు.కేసు కు సంబంధించిన వివరాలను మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ వెల్లడించారు. చోరి కి గురి అయిన 7.5తులాల బంగారం ,సెల్ ఫోన్ ను నిందితుల నుంచి రికవరీ చేసినట్లు అడిషనల్ ఎస్పీ చెప్పారు. అదే ఇంట్లో అద్దెకుంటున్నావారే ఈ దొంగతనం కు పాల్పడినట్లు నిర్ధారణ అయిందన్నారు. అయితే నిందితులపై పూర్తి విచారణ తర్వాత నిందుతుల వివరాలు ప్రకటిస్తామన్నారు . నిందితులకు ఇంకేమైనా కేసులో ప్రమేయం ఉందని కోణంలో ప్రత్యేక విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. చోరి జరిగిన తర్వాత ఫిర్యాదు చేసేటప్పుడు వాస్తవ విషయలను మాత్రమే పిర్యాదు లో పొందుపర్చాలని బాధితులు కి సున్నితంగా మందలించి చెప్పారు.ఈ కేసును ఛేదించిన ఎస్సై సాయికిరణ్, డబ్ల్యూ పిసి రాజమణి ని ఈ సందర్భంగా అభినందించారు. వీరికి రివార్డ్ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఇంటి యాజమానులు గదులు అద్దెకు ఇచ్చేటప్పుడు వ్యక్తుల వివరాలను తెలుసుకోవాలని సూచించారు . ఈ సమావేశంలో ఎస్ఐ సాయికిరణ్,ఎఎస్ఐ గంగారాం, హెడ్ కానిస్టేబుల్, రాజారాం, కానిస్టేబుల్ నరేందర్ చారి , గణేష్, పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed