- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రైవేట్ హాస్పిటల్ లో ఇన్సూరెన్స్ దోపిడీ
దిశ, వరంగల్ : ప్రైవేట్ హాస్పిటల్ లో ఇన్సూరెన్స్ దోపిడీ వెలుగులోకి వచ్చింది. కాశీబుగ్గ కి చెందిన యువకుడు కిడ్నీ సమస్య అని స్థానిక సంరక్ష హాస్పిటల్ లో శనివారం జాయిన్ అయ్యాడు. గత నాలుగు రోజులుగా ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తూ మూడు వారాల తరువాత ఆపరేషన్ చెయ్యాలి అని బుధవారం డిశ్చార్జ్ చేశారు. అనంతరం యువకుడు తన ఇన్సూరెన్స్ కంపెనీ నుండి 77వేల రూపాయల క్లెయిమ్ అయినట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. పేషంట్ కు ఆపరేషన్ చేయకున్నా చేసినట్లు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో యాజమాన్యం బిల్ క్లెయిమ్ చేశారని,
మళ్లీ మూడు వారాల తర్వాత ఆపరేషన్ ఫెయిల్ అయిందని మళ్లీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి డబ్బులు వసూలు చేస్తారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. వారం రోజుల పాటు ఆపరేషన్ థియేటర్ లో పెట్టి ఎండోస్కోపీ చేసినందుకు ఒక అనస్థీషియా డాక్టర్ కు అయిన ఖర్చు 64 వేలు అని బిల్లులో చూపెట్టినట్టు తెలిపారు. రూ. 77 వేలు ఎలా క్లెయిమ్ చేశారని బాధితుడు ప్రశ్నిస్తున్నాడు. కాగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అలానే ఉంటుంది అంటూ హాస్పిటల్ యాజమాన్యం సమాధానం ఇస్తున్నారని యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.