భార్యపై కోపంతో బార్‌లో కాల్పులు..

by Vinod kumar |
భార్యపై కోపంతో బార్‌లో కాల్పులు..
X

వాషింగ్టన్: ఓ రిటైర్డ్ పోలీసు అధికారి.. చేతిలో గన్ ఉంది కదా అని దారుణానికి తెగబడ్డాడు. తనకు దూరంగా జీవిస్తున్న భార్యను లక్ష్యంగా చేసుకొని అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఆరెంజ్‌ కౌంటీలో ఉన్న బైకర్స్‌ బార్‌లో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. అతడిని అడ్డుకునేందుకు యత్నించిన వారందరిపై తుపాకీ ఎక్కుపెట్టాడు. ఈ కాల్పుల్లో అతగాడి భార్యతో పాటు మరో ముగ్గురు చనిపోయారు. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. హంతకుడిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈక్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు కూడా చనిపోయాడు. దీంతో చనిపోయిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. మరో ఆరుగురికి గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story