ఆయనది గుప్తుల పాలనను మరిపించింది

by srinivas |
ఆయనది గుప్తుల పాలనను మరిపించింది
X

దిశ ఏపీ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి, దివంగత రాజశేఖరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని వైజాగ్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, “దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన గుప్తుల కాలాన్ని మరిపించింది. వైఎస్సార్‌ హయాంలో రైతుల సంక్షేమానికి బాటలు పడ్డాయి. 22 లక్షల హెక్టార్ల కు సాగు నీరు అందించి భూములను సస్యశ్యామలం చేశారు.

అప్పట్లో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగ అంటే వ్యవసాయం పండగ అని నిరూపించిన ఘనుడు రాజశేఖరరెడ్డి. 32 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారు. 26 లక్షల ఎకరాల్లో అటవీ భూములపై ఆదివాసీలకు హక్కు కల్పించిన ఘన చరిత్ర వైఎస్సార్‌ది. 108, 104 వాహనాలు సమకూర్చి ప్రజలను ఆదుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని వైఎస్సార్‌‌ ద్వారానే సాధ్యమైంది”అని ఆయన సేవలను కొనియాడారు.

అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, వైఎస్‌ రాజశేఖరెడ్డి పాలనా కాలం స్వర్ణయుగమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వైఎస్సార్‌ చెరగని ముద్ర వేశారని కొనియాడారు. రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పటికీ ప్రజలను ఆదుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు నేరుగా సంక్షేమ ఫలాలు అందించడంలో రాజశేఖరరెడ్డిది ప్రత్యేక శైలి అని ఆయన కొనియాడారు.

Advertisement

Next Story