- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంత మొనగాళ్లైతే 6 గంటలు చేయండి.. టీఆర్ఎస్ నేతలపై వైఎస్ షర్మిల సెటైర్లు
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ చేపట్టిన ధర్నా ఫలితంగానే కేంద్రం 3 కొత్త సాగు చట్టాలని ఎత్తివేసిందని చెప్పుకోవడంపై వైఎస్సార్ టీపీ చీఫ్షర్మిల శనివారం ట్విట్టర్వేదికగా ఫైరయ్యారు. ముఖ్యమంత్రి కేవలం మూడుగంటల పాటు ధర్నా చేసి.. రైతు చట్టాలను రద్దు చేపించామని జబ్బలు చరుచుకోవడం హాస్యాస్పదమన్నారు. టీఆర్ఎస్ నేతలు అంత మొనగాళ్లైతే 6 గంటలు ధర్నా చేసి రైతుల వడ్లన్నీ కేంద్రం కొనేలా చేయాలని ఆమె డిమాండ్చేశారు. మంచి జరిగితే టీఆర్ఎస్ ఖాతాలో లేకుంటే ఇతరులపై బట్ట కాల్చి మీదేయడం వారికి అలవాటేగా అంటూ సెటైర్లు వేశారు. ఇదిలా ఉండగా ఎన్నికల సమయంలో ఉత్తుత్తి హామీలు ఇచ్చినట్టు, ఉత్తుత్తి కొనుగోలు సెంటర్లను పెట్టి రైతులను మసిపూసి మారేడుకాయ చేయాలని, మోసం చేయాలని చూస్తే వదిలిపెట్టేది లేదని షర్మిల హెచ్చరించారు. సెంటర్లు పెట్టడం కాదు.. ముందు కాంటాలు పెట్టి రైతుల ధాన్యం వర్షం పాలు కాకముందే కొనాలని ఆమె డిమాండ్ చేశారు.
- Tags
- dharna