పార్టీ ప్రకటనపై స్పందన : తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు

by Shyam |   ( Updated:2023-03-14 09:03:45.0  )
పార్టీ ప్రకటనపై స్పందన : తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఎట్టకేలకు వైఎస్ షర్మిల స్పందించారు. కొత్త పార్టీ ప్రకటన గురించి త్వరలోనే స్పందిస్తామని చెప్పారు. పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారంపై ఖండించే ప్రయత్నం చేయలేదు. కానీ కొత్త పార్టీ ఏర్పాటు సిద్ధం చేసుకునేందుకు గ్రౌండ్ రియాలిటీ చెక్ చేస్తున్నట్లు చెబుతున్నారు వైఎస్ షర్మిల. రాష్ట్రానికి చెందిన ప్రతీ జిల్లాకు చెందిన నేతలతో చర్చిస్తామని,ముందస్తుగా నల్గొండ జిల్లాకు చెందిన నేతలతో మాట్లాడుతున్నట్లు చెప్పిన షర్మిల.., క్షేతస్థాయిలో వాస్తవాలేంటో ప్రజలకు, నాయకులకు తెలుసు. కాబట్టే వాళ్లతో చర్చిస్తున్నాం. తెలంగాణలో నేను పార్టీ పెట్టకూడదా..? వైఎస్ఆర్ లేని లోటు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది.తెలంగాణలో రాజన్నరాజ్యం లేదు. త్వరలో తీసుకొస్తామని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు.

Advertisement

Next Story