- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నందమూరి బాలకృష్ణపై వైసీపీ ఎమ్మెల్సీ ఫైర్
దిశ, ఏపీ బ్యూరో : అఖండ మూవీ సూపర్ హిట్ అయ్యింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో నందమూరి బాలకృష్ణ మాంచి జోష్ మీద ఉన్నారు. ఇలాంటి తరుణంలో బాలకృష్ణపై వైసీపీ ఎమ్మెల్సీ, హిందుపురం వైసీపీ ఇన్ చార్జ్ మహమ్మద్ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్య ధ్యాస అంతా సినిమాలపైనే తప్ప నియోజకవర్గంపై లేదన్నారు.
నియోజకవర్గ ప్రజల గోడు వినిపించుకునేలా ఎమ్మెల్యే బాలకృష్ణకు బుద్ధి ప్రసాదించాలన్నారు. హిందూపురంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమాలు తప్ప ప్రజల సమస్యలపై బాలకృష్ణకు ధ్యాసేలేదన్నారు. ఆరు నెలలకోసారైనా ఎమ్మెల్యేను హిందూపురానికి తీసురాగలరా అంటూ టీడీపీ నేతలను ఎమ్మెల్సీ ఇక్బాల్ ప్రశ్నించారు. సినిమా హిట్ అంటూ భారీ వసూళ్లు వస్తున్నాయని మాట్లాడుతున్న బాలకృష్ణ..తనకు ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఒక్కసారైనా స్పందించారా అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఎమ్మెల్యే విధులు, కర్తవ్యాలు చదివైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
మరోవైపు ఓటీఎస్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం–ఓటీఎస్ పేదలకు వరం లాంటిదని అని కొనియాడారు. నామమాత్రపు రుసుముతో గృహంపై ఎంతమేర రుణం ఉన్నా ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్‌మెంట్) ద్వారా మాఫీ చేసి సంపూర్ణ హక్కు పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్సీ ఇక్బాల్ స్పష్టం చేశారు. రుణవిముక్తి పొందిన లబ్ధిదారులు తమ ఇంటిని ఇతరులకు బదలాయింవచ్చని, ఇంటిపై బ్యాంకు రుణాలు పొందవచ్చని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఓటీఎస్ పథకం ఎందుకు మంచిది కాదో టీడీపీ నాయకులు చెప్పాలని, హిందూపురంలో బాలకృష్ణతోనే తాము చర్చకు సిద్దమని ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాల్ విసిరారు.