యాదాద్రిలో వైభవంగా స్వామివారి రథోత్సవం

by Shyam |
యాదాద్రిలో వైభవంగా స్వామివారి రథోత్సవం
X

దిశ, ఆలేరు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి, అమ్మవార్లను దివ్య విమానం రథంలో ఊరేగించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో కొండ కింద దేవస్థానం ప్రచారంలో స్వామి అమ్మవార్లను ఉత్సవమూర్తులగా అధిష్టించారు. ఉత్సవం సందర్భంగా దివ్య విమాన రథాన్ని విద్యుత్ దీపాలతో వివిధ రకాల పుష్ప మాలికలతో శోభాయమానంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ నరసింహ మూర్తి, ఈవో గీతారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు నల్లంతిఘల్ లక్ష్మీనరసింహాచార్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story