తెలంగాణలో యుముడికి ఘనంగా పూజలు.. ఎక్కడో తెలుసా.?

by Sridhar Babu |
తెలంగాణలో యుముడికి ఘనంగా పూజలు.. ఎక్కడో తెలుసా.?
X

దిశ, ధర్మపురి : ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురిలో యమధర్మరాజు స్వామికి ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. సోమవారం యమధర్మరాజు స్వామి జన్మ నక్షత్రం(‌భరణి నక్షత్రం) సందర్భంగా ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుసూక్తం, యమసూక్తంతో పాలాభిషేకం, హారతి మంత్ర పుష్ప కార్యక్రమాలను భక్తులు తిలకిస్తుండగా అర్చకులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, అర్చకులు చిలుకముక్కు ప్రదీప్ కుమార్, నేరెళ్ల సంతోష్ కుమార్, వొద్దిపర్తి కళ్యాణ్, అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్ శర్మ, బొజ్జ రాజగోపాల్, భక్తులు పాల్గొన్నారు.

Dharmapuri

Advertisement

Next Story