US Elections : డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా డెమొక్రాటిక్ పార్టీ మాజీ నేత తులసి గబ్బార్డ్

by Maddikunta Saikiran |
US Elections : డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా డెమొక్రాటిక్ పార్టీ మాజీ నేత తులసి గబ్బార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా మాజీ కాంగ్రెస్ మహిళ, డెమొక్రాటిక్ పార్టీ మాజీ నేత తులసి గబ్బార్డ్ నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్నీ నేషనల్ గార్డ్ అసోసియేషన్ సమావేశంలో వెల్లడించింది. అమెరికా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో బహుళ యుద్ధాలను ఎదుర్కొంటోందని , అలాగే అమెరికా అణు యుద్ధం అంచుకు దగ్గరగా ఉందని గబ్బర్డ్ చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్‌ను వైట్‌హౌస్‌కి తిరిగి పంపడానికి నేను చేయగలిగినదంతా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ,ట్రంప్ వైట్ హౌస్ లో కమాండర్-ఇన్-చీఫ్‌గా మాకు సేవ చేయగలడని ఆమె పేర్కొంది.అలాగే వచ్చే ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయట పడేస్తారని తులసి గబ్బార్డ్ అన్నారు.

కాగా గబ్బార్డ్ 2020లో డెమోక్రటిక్ పార్టీని విడిచి పెట్టి రిపబ్లిక్ పార్టీ లో చేరారు. ట్రంప్ , హారిస్ మధ్య వచ్చే నెల డిబేట్లలో ట్రంప్ సలహాదారుగా తులసి వ్యవరించనున్నారు. కమలా హారిస్‌పై చర్చలో తన దాడులకు పదును పెట్టేందుకు ట్రంప్ తులసి గబ్బార్డ్‌ను తీసుకువచ్చారని న్యూయార్క్ టైమ్స్ గతంలోనే నివేదించింది. ముఖ్యంగా ట్రంప్ మొదటి సారిగా ఎన్నికల ప్రత్యర్థిగా ఒక మహిళతో తలపడుతున్న తరుణంలో గబ్బర్డ్ యొక్క అనుభవం, సూచనలు ట్రంప్ కు ఉపయోగపడుతాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

Advertisement

Next Story