ట్రాన్స్ జెండర్‌లకు గుడ్ న్యూస్

by Gantepaka Srikanth |
ట్రాన్స్ జెండర్‌లకు గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రతి జిల్లాకో క్లినిక్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రులు లేదా టీచింగ్ ఆసుపత్రుల్లోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. అవసరాన్ని బట్టి వారానికి రెండు లేదా మూడు రోజుల పాటు క్లినిక్స్‌ నిర్వహించనున్నారు. ప్రతి క్లినిక్‌లో జనరల్ ఫిజిషియన్‌, డెర్మటాలజిస్ట్‌, సైకియాట్రిస్ట్ , గైనకాలజిస్ట్, యూరాలజిస్ట్‌, ఇతర స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్యశాఖ, మహిళా సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ క్లినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed