Eluru: ఏలూరు జిల్లాలో దారుణం.. విద్యార్థినులపై హాస్టల్ వార్డెన్ భర్త లైంగిక‌ దాడి!

by Shiva |   ( Updated:2024-09-18 03:47:21.0  )
Eluru: ఏలూరు జిల్లాలో దారుణం.. విద్యార్థినులపై హాస్టల్ వార్డెన్ భర్త లైంగిక‌ దాడి!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లా (Eluru District)లో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినులను కంటికిరెప్పలా కాపాడాల్సిన వార్డెన్ తన బాధ్యతను విస్మరించింది. వివరాల్లోకి వెళితే.. స్వామి దయానంద సరస్వతి హాస్టల్‌ (Swami Dayananda Saraswathi Hostel)లో వార్డెన్ ఫణిశ్రీ భర్త శశికుమార్ విద్యార్థులకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేశాడు. అందులో ఓ విద్యార్థినిని బాపట్ల (Bapatla) ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు. అయితే, విషయాన్ని ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. మరోవైపు వార్డెన్ ఫణిశ్రీ కూడా భర్తకు సహరించాలంటూ విద్యార్థినులపై ప్రెషర్ తీసుకొచ్చినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వారి ఫిర్యాదు మేరకు శశికుమార్‌పై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed