Medchal: మేడ్చల్ జిల్లాలో అమానుషం.. ఇద్దరి గొంతు కోసిన దుండగులు

by Shiva |
Medchal: మేడ్చల్ జిల్లాలో అమానుషం.. ఇద్దరి గొంతు కోసిన దుండగులు
X

దిశ, మేడ్చల్ టౌన్: గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరి గొంతు కోసిన ఘటన మేడ్చల్ మున్సిపాలిటి పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కిష్టాపూర్ గ్రామంలో బీహార్‌కు చెందిన పవన్ కుమార్‌, సంతోష్ కిష్టాపూర్ తోచిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి పరారయ్యారు. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అందులో సంతోష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story