ఆర్టీసీ స్కూల్ బస్సును ఢీకొన్న కారు…

by Kalyani |
ఆర్టీసీ స్కూల్ బస్సును ఢీకొన్న కారు…
X

దిశ, కొత్తకోట : కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో మదర్ తెరిస్సా జంక్షన్ దగ్గర ఆర్టీసీ స్కూల్ బస్సును కారు ఢీ కొట్టిన సంఘటన నేషనల్ హైవే 44 పై చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే శుక్రవారం సాయంత్రం కొత్తకోట మండలం అముడబాకుల గ్రామంలోని మోడల్ స్కూల్లో చదివే విద్యార్థినీ విద్యార్థులను ఎక్కించుకొని మదర్ తెరిసా జంక్షన్ దగ్గర కొత్తకోటలోకి మలుపుతున్నక్రమంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. బస్సు డోర్, కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా, బస్సులోని విద్యార్థులకు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న కారుడ్రైవర్ కు మరో ఇద్దరికి గాయాలు అయ్యాయని చెప్పారు. వేగంగా వచ్చి స్కూల్ బస్సును ఢీకొన్న కారు డ్రైవర్ పై కేసు నమోదు చేయాలని ఆర్టీసీ డ్రైవర్ తెలిపినట్లు స్థానిక ఎస్సై మంజునాథ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed