పాతబస్తీ బెల్టుషాపులో అక్రమంగా మద్యం డంపింగ్​..

by Aamani |
పాతబస్తీ బెల్టుషాపులో అక్రమంగా మద్యం డంపింగ్​..
X

దిశ,చార్మినార్​ : గణేష్​ నిమజ్జనోత్సవాల సందర్భంగా ముందస్తు చర్యల్లో భాగంగా రెండు రోజుల పాటు వైన్స్​ లు, బార్​లు మూసివేయనున్నారు.ఈ నేపథ్యంలో అక్రమంగా భారీగా మద్యం డంపింగ్​ చేస్తున్న కేంద్రంపై సౌత్​ జోన్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. గణేష్​ నిమజ్జనం రోజున మద్యం బ్లాకులో విక్రయించడానికి బెల్ట్​ షాప్ కి తరలిస్తుండగా ఓ మహిళను సౌత్​జోన్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు రెడ్​ హ్యాండెగా అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 1.10లక్షల విలువైన బీర్లతో పాటు మద్యంను, మారుతి కారును స్వాధీనం చేసుకున్నారు. సౌత్​ జోన్​ టాస్క్​ ఫోర్స్​ ఇన్స్పెక్టర్ ఎస్​.​ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం ... పాతబస్తీ లలితాబాగ్​ కు చెందిన ఎన్​ శోభారాణి అలియాస్​ లలితమ్మ (50) ఎటువంటి లైసెన్స్​ లేకుండా అధిక ధరకు తెల్లవార్లు స్థానికంగా పెద్ద ఎత్తున మద్యం విక్రయిస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఆమెపై కేసులు నమోదు చేసినప్పటికీ లలిత ప్రవర్తనలో మార్పు రాలేదు. అంతేగాకుండా గణేష్​ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17వ తేదీ ఉదయం 6గంటల నుంచి 18 వ తేదీ సాయంత్రం 6గంటల వరకు వైన్స్​ షాపులు, బార్​లు మూసివేయాలని నగర పోలీస్​ కమిషనర్​ ఆంక్షలు విధించిన విషయం విధితమే.

దీంతో పెద్ద ఎత్తున మద్యం నిలువ ఉంచి అధిక ధరకు విక్రయించాలన్న నేపథ్యంలో లలిత మారుతి వ్యాన్​లో సమీప వైన్స్​ షాపుల నుంచి పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసి లలితా బాగ్​లోని బెల్ట్​ షాప్ కు తీసుకువచ్చింది. లలిత బెల్టు షాపులోకి డంప్​ చేస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్​ఫోర్స్​ అడిషనల్​ డీసీపీ అందె శ్రీనివాస్​ ఆధ్వర్యంలో సౌత్​ జోన్​ టాస్క్​ ఫోర్స్​ ఇన్​స్పెక్టర్​ రాఘవేంద్ర బృందం దాడులు నిర్వహించింది. రెడ్​ హ్యాండెడ్​గా లలితను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 40 కాటన్​ల బీర్లతో పాటు 12 బాటిళ్ల మద్యంతో పాటు ఒక మారుతి వ్యాన్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం సౌత్​జోన్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. ఈ కేసును ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed