మైనర్ పై జానీ మాస్టర్ అత్యాచారం.. సంచలన ఆరోపణలు చేసిన స్టార్ సింగర్.. నెట్టింట దుమారం రేపుతున్న ట్వీట్

by Kavitha |   ( Updated:2024-09-18 12:10:06.0  )
మైనర్ పై జానీ మాస్టర్ అత్యాచారం.. సంచలన ఆరోపణలు చేసిన స్టార్ సింగర్.. నెట్టింట దుమారం రేపుతున్న ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న జానీ మాస్టర్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈయన ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదులో.. జానీ మాస్టర్ తనను కోరిక తీర్చాలని వేధించినట్లు, కోరిక తీర్చకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని, తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ ఒత్తిడి చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ఇష్యూ టాలీవుడ్‌లో దుమ్ము దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్ అధికారికంగా స్పందించింది. అలాగే కొంతమంది సెలబ్రెటీలు సైతం దీనిపై స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ సింగర్ చిన్మయి స్పందించింది. అందులో భాగంగా పలు మీడియా కథానాలను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది.

ఆమె మాట్లాడుతూ.. "నివేదికల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడు. అత్యాచారం చేయడం ఒక ఎత్తైతే, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడడం మరో పెద్ద నేరం. ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి మరింత శక్తి చేకూరాలని నేను కోరుకుంటున్నాను" అంటూ చిన్మయి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన ట్వీట్ నెట్టింట దుమ్ము దుమారం రేపుతోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

(video link credits to chinmayi sipaada X account)


Read More..

Video: రోడ్డుపై డాన్స్‌తో నిరసన తెలిపిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం తెలిస్తే శభాష్ అనాల్సిందే

Advertisement

Next Story

Most Viewed