- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారం రోజులైన కొందరికి తగ్గని దగ్గు, జలుబు.. ఆ ట్రీట్‌మెంట్ బెటర్ అంటున్న వైద్యులు!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులు తగ్గుముఖం పట్టాయి. అధికారిక రికార్డుల ప్రకారం గడిచిన రెండు నెలల్లో ఈ వ్యాధుల బాధితులు తగ్గినట్టు స్పష్టం అవుతున్నది. రాష్ట్రంలో ఈ ఏడాది సెప్టెంబరులో వైద్యారోగ్యశాఖ గణాంకాల ప్రకారం డెంగీ కేసులు 1,542 నమోదు కాగా, అక్టోబరులో 854కు తగ్గాయి. నవంబరులో 22వ తేదీ వరకు 168 కేసులు రికార్డయినట్టు ఆఫీసర్లు తెలిపారు. అంటే ఒక్కొ నెలకు సగటున 50 % చొప్పున బాధితులు తగ్గారు. మలేరియా, చికున్‌గున్యా కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. అయితే, వాతావరణ మార్పులతో వస్తున్న కామన్ ఫ్లూ మాత్రం పబ్లిక్‌ను లాంగ్ టర్మ్‌లో వేధిస్తున్నది.
పెరిగిన ఫ్లూ ట్రీట్‌మెంట్ టైం
కొందరికి వారం రోజుల్లో దగ్గు, సర్ది తగ్గితే, మరి కొందరికి నెల రోజుల వరకు తగ్గట్లేదని వైద్యులు పేర్కొంటున్నారు. గతంలో వారం రోజులుగా ఉన్న ట్రీట్‌మెంట్ ఇప్పుడు వన్ మంత్‌కు పెరిగింది. అయితే, కామన్‌ప్లూతో ఎలాంటి ఇబ్బంది లేదని, జ్వరం, దగ్గు, జలుబుకు సింప్టమాటిక్‌తో పాటు అవసరమైనోళ్లకు యాంటిబయాటిక్ ట్రీట్‌మెంట్ అందిస్తే సరిపోతుందని వైద్యులు వివరిస్తున్నారు. సీజనల్ ఫ్లూతో బ్రీతింగ్ సమస్యలు వంటివి వచ్చే వాళ్ల సంఖ్య కూడా గతంలో పోల్చితే చాలా తక్కువైందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. ఆస్తమా, లంగ్ సమస్యలతో బాధపడే వాళ్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని గాంధీ ఆసుపత్రిలోని ఓ వైద్యుడు తెలిపారు.
ఆస్పత్రుల్లో 50 % తగ్గుతున్న డెంగీ బాధితులు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రులకు వస్తున్న పేషెంట్లలో అత్యధికంగా సీజనల్ వ్యాధుల బాధితులే ఉంటున్నారు. జ్వరం, దగ్గు, సర్ది వంటి కామన్ సింప్టమ్స్ పేషెంట్లు క్యూ కడుతున్నారు. రెండు నెలల క్రితం డెంగీ, చికున్‌గున్యా కేసులలో ఎక్కువ మంది ఆసుపత్రులకు రాగా, ఇప్పుడు కామన్ సింప్టమ్స్‌తో ఆసుపత్రులు నిండుతున్నాయి. ప్రతి రోజూ హాస్పిటల్స్‌కు వస్తున్న ఓపీలో డెంగీ అనుమానితుల సంఖ్య 50 % చొప్పున తగ్గింది. గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌తో పాటు జిల్లాల్లోనూ ఇదే సిచ్యువేషన్ ఉన్నది. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ డెంగీ కేసులు సంఖ్య తగ్గిందని ఆఫీసర్లు చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో జ్వర బాధితులు అత్యధికంగా వచ్చే ఫీవర్ హాస్పిటల్‌లో ఆగస్ట్, సెప్టెంబర్‌లో రోజూ సగటున 1,500 ఓపీ వస్తే, ఇప్పుడు 400 నుంచి 500 మాత్రమే నమోదవుతుందని, వీటిలోనూ డెంగీ అనుమానితులు అత్యల్పంగా ఉన్నదని ఆ ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు.
జనవరి నుంచి ఆగస్టు వరకు 7 % పాజిటివిటీ..
ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 21 వరకు 66,589 శాంపిళ్లను టెస్టు చేస్తే 4,648 కేసులు నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ గతంలో ప్రకటించింది. అంటే పాజిటివిటీ 7 % చొప్పున నమోదైంది. ఏకంగా పది జిల్లాల్లో డెంగీ హైరిస్క్‌గా ప్రకటించారు. కానీ, ఈ జిల్లాల్లో గడిచిన రెండు నెలలుగా డెంగీ వ్యాప్తి తగ్గిందని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో డెంగీ కేసులు, డెత్‌లను వైద్యారోగ్యశాఖ ఇప్పటికీ గుర్తించలేకపోతున్నదని స్వయంగా ప్రభుత్వ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అనధికారికంగా రెట్టింపు స్థాయిలో డెంగీ కేసులు ఉంటాయని నొక్కి చెప్తున్నారు.
చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ లోహిత్‌రెడ్డి, పీడియాట్రిషన్
వాతావరణ మార్పులతో చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి. పదేండ్లలోపు పిల్లలను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. రూరల్‌తో పోల్చితే అర్బన్ ఏరియాల్లో నివసించే పిల్లలు కేర్ తీసుకోవాలి. పొల్యూషన్, చలి గాలి కలవడం వల్ల శ్వాస కోస సంబంధిత సమస్యలు రావొచ్చు. అలర్జీల ఎటాక్ కూడా ఉంటుంది. ఇది తీవ్రమైతే బ్రీతింగ్ సమస్యలు వచ్చి ప్రమాదంగా మారే చాన్స్ ఉన్నది. అందువలన ఉదయం, రాత్రి వేళ్లలో మంచు పడే సమయంలో చిన్నారులను బయట తిప్పవద్దు. ఆస్తమా ఉన్నోళ్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్లకు దగ్గు, జలుబు ఉంటే, మాస్క్ వంటివి ధరించడం బెటర్. రెండు మూడు రోజుల పాటు చిన్నారులకు అంటకుండా కేర్ తీసుకోవాలి. చిన్నారులకు జ్వరం లేదా నీరసం, ఆహారం తీసుకోకపోవడం, వంటి ఏ సమస్య ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
ఇమ్యూనిటీ సిస్టంపై ఎఫెక్ట్: డాక్టర్ రాజీవ్, క్రిటికల్ కేర్ ఎక్స్‌పర్ట్
చల్లని ఉష్ణోగ్రతలు రోగనిరోధక వ్యవస్థనుబ లహీనపరుస్తాయి. దీంతోనే జలుబు, ఫ్లూవంటి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు ప్రబలుతాయి. ఇదే క్రమంలో వైరస్ వ్యాప్తి కూడా అధికంగానే ఉంటుంది. చల్లని గాలి ప్రభావం ఎక్కువైతే న్యూమోనియా వంటి ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. ఈ వాతావరణ పరిస్థితులు వ్యాధుల వ్యాప్తికి కూడా అనుకూలంగా ఉంటాయి. లక్షణాలు తీవ్రతరం కాకముందే మెడికేషన్ అవసరం. ముఖ్యంగా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు అలర్ట్‌గా ఉండాలి. ఉదయం, రాత్రి వేళల్లో వెచ్చని దుస్తులు ధరించాలి. క్రమం తప్పకుండా వేడి పానియాలు తీసుకోవాలి.