- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వణికిస్తున్న చలి..రాత్రి వేళల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
దిశ, మద్నూర్: మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లోని ప్రజలు ఉదయం, రాత్రి చలి మంటలు కాగుతూ కనిపిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు చలి తీవ్రతను తట్టుకోలేక చలి మంటలు కాచుకోక తప్పట్లేదు. చలి వణికిస్తోంది ఉదయం, రాత్రి వేళల్లో ఇంటా బయట తిరగడానికి ఇబ్బందులు పడుతున్నారు. వేకువ జామున పొగమంచు తోడు కావడంతో చిరు వ్యాపారులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతూనే ఉన్నాయి. గ్రామాల్లో ఉదయం 8,9 గంటల వరకు కూడా సూర్యరశ్మి బయటకు రావడం లేదు. పొగ మంచు కారణంగా వాహనదారులకు దారి కనిపించక ఇబ్బందులు పడ్డారు. పొగమంచు చలితో ప్రజలు చిరు వ్యాపారులు, రైతులు, నడకదారులు, చలి తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు. చలికి భయానికి వృద్ధులు పూర్తిగా ఇండ్లలోనే ఉంటున్నారు. చలి పెరగడంతో ఉన్ని దుస్తులకు గిరాకీ పెరిగింది. ఉదయం, సాయంత్రం వేళల్లో చిరు వ్యాపారుల చలికి ద్విచక్ర వాహనాలపై వెళ్లాలంటేనే జంకుతున్నారు. కూరగాయలు, పాల వ్యాపారులు ఉదయం చలి తీవ్రతలోనే ఇబ్బందులు పడుతూ వ్యాపారాలు చేస్తున్నారు. ఉదయం వేళల్లో రోజూ పొగమంచుకు ముందున్న వాహనాలు, రహదారులు కనిపించక ఇబ్బంది పడుతున్నారు.
ఆరోగ్యంపై జాగ్రత్త..: వైద్యులు
చలి తీవ్రత నేపథ్యంలో ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలి. అస్తమా ఇతర శ్వాస కోశ సమస్యలున్నవారు అవస్థలు పడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. చలిలో ఎక్కువగా తిరగడంతో ఆరోగ్యంలో గుండె, చర్మ, ఇతర సమస్యలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.