Rain Alert:బంగాళాఖాతంలో బ‌ల‌ప‌డిన అల్ప‌పీడ‌నం.. మూడు రోజులు భారీ వర్షాలు

by Jakkula Mamatha |
Rain Alert:బంగాళాఖాతంలో బ‌ల‌ప‌డిన అల్ప‌పీడ‌నం.. మూడు రోజులు భారీ వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్: దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఇటీవల వాతావరణ అధికారులు(Weather officials) హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. తర్వాత వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు- శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని, దీంతో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

అయితే బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Meteorological Department) అధికారులు తెలిపారు. దీంతో సోమ, మంగళ, శనివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు చోట్ల వర్షాలు కురుస్తాయి. 27, 28 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో, 29న విశాఖ, అనకాపల్లి, కాకినాడ. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. 30న కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు(Rains) కురుస్తాయని పేర్కొంది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి ఉండే నేప‌థ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Next Story