- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Gadwal: రామనుకున్నారా.. రాలేమనుకున్నారా.. పోలీసులకు ఓ లేబుల్ బ్యాచ్ అల్టిమేటం
జిల్లా కేంద్రం ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణంలోని వస్తుందనుకునే లోపే అంతలేదు మేం తగ్గం అనే రీతిలో మద్యం మత్తులో గద్వాల పట్టణం నడిబొడ్డున ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆపి మరీ ఆ బస్సు డ్రైవర్ పై అకారణంగా విచక్షణా రహితంగా దాడి చేసి మేం తగ్గేదెలె అంటూ పోలీసులకు సవాల్ విసురుతూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు గద్వాల పట్టణంలోని ఓ లేబుల్ బ్యాచ్..
దిశ,గద్వాల : జిల్లా కేంద్రంలో గత రెండు నెలలుగా పోలీసులు అర్థరాత్రి గస్తీ కాసి మరి రాత్రుల పుట మద్యం తాగుతూ రోడ్లపై హల్చల్ చేస్తున్న యువకులను అరెస్ట్ చేస్తున్నారు. అలాగే గ్రూపులుగా ఏర్పడి కొందరు వ్యక్తులపై దాడులు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులను సీరియస్ గా తీసుకొని అటు గద్వాల రూరల్ పోలీసులు.. ఇటు గద్వాల పట్టణ పోలీసులు విస్తృతంగా తనీఖీలు నిర్వచించి, అదుపులోకి తీసుకున్న యువకులలో కొందరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపడం.. మరికొందరిని తీవ్రతను బట్టి రిమాండ్ కు తరలించడం చేశారు పోలీసులు. ఇప్పుడిప్పుడే పట్టణంలో జరుగుతున్న వరుస ఘటనలు అదుపులోకి వస్తున్నాయి అనుకుంటున్న సందర్భంలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి పట్టణాన్ని ఉలిక్కి పడేలా చేసింది.
గంజాయి,మద్యం మత్తులో విచక్షణ కోల్పోతున్న యువత
కొందరు యువకులు గంజాయి పీలుస్తూ దానికి బానిసలై విచక్షణా కోల్పోయి ఆ మత్తులో ఏమి చేస్తున్నారో కూడా వారికి తెలియని స్థితిలో వాళ్ళ లేబుల్ ఉన్న గ్రూప్స్ మెంబెర్స్ తో కలిసి క్షణాల్లో కొందరిపై అకారణంగా దాడులకు పాల్పడి పారిపోతున్నారని కొందరు ప్రత్యక్షంగా చూసిన వారు చెప్తున్నారు. పోలీసులు,ప్రజాప్రతినిధులు వారిని కట్టడి చేయలేకపోతే గద్వాల మరో బీహార్ లా మారే అవకాశం లేకపోలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సామాజిక వేత్తలు.
వీరిని అరికట్టేదెలా..!?
పోలీసులు ఇలాంటి వారిపై ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి గట్టి నిఘా ఉంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఘటనలు జరిగిన సందర్భంలో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా పోలీసులకు పూర్తి స్వేచ్చనిస్తే అలా చెడు వ్యసనాలను అలవాటు పడి విచక్షణా కోల్పోయి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే, గద్వాల పట్టణం ప్రశాంతంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.