- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. నేడు దర్శనం, గదుల కోటా విడుదల
దిశ, వెబ్ డెస్క్: నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే తిరుమలకు భక్తుల తాకిడి తగ్గింది. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. నిన్న స్వామివారిని 75,737 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. ఇక కొండపై చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో.. భక్తులు గజగజ వణికిపోతున్నారు. ఆఖరి కార్తీక సోమవారం కావడంతో.. శైవక్షేత్రాలకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. అరుణాచల క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది.
రూ.300 దర్శనం టికెట్లు విడుదల
నేడు శ్రీవారి దర్శన, గదుల టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గదుల కోటాను విడుదల చేయనున్నారు. స్వామివారి ఆర్జిత సేవలు, దర్శనం, వసతి కోటా టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.